Thursday, 19 January 2017

రిలయన్స్ జియో 4జి వినియోగదారులకు శుభవార్త

టెలికాం రంగంలో తీవ్ర దుమారం రేపి, అప్పటి వరకూ దిగ్గజాలుగా ఉన్న కంపెనీలకు చుక్కలు చూపించిన రిలయన్స్ జియో మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఇండియాలో అందుబాటులో లేని 5జీ సేవలను మొట్టమొదటి సారిగా జియో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇదే గానీ జరిగితే మిగిలిన కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూడక తప్పని పరిస్థితి. అయితే ఈ తతంగానికి చాలా సమయం పట్టేలా ఉన్నప్పటికీ ఇప్పటివరకూ జియో కనెక్షన్ తీసుకున్న కస్టమర్లందరికీ ఈ సేవలను అందించాలనే యోచనలో జియో ఉంది. 5జీ స్మార్ట్‌ఫోన్లను కూడా భారత మార్కెట్లోకి అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.
 
దీంతో పాటు జియో టీవీ అనే కొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తేవడానికి యాజమాన్యం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నార్మల్ టీవీ నుంచి స్మార్ట్‌ టీవీకి మారడానికి ఈ సర్వీస్ దోహదపడుతుందని సంస్థ తెలిపింది. జియో టీవీ గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఓ డీటీహెచ్ సర్వీస్. దీని ద్వారా 360కి పైగా చానల్స్‌ అతి తక్కువ ధరకు అందుబాటులోకి తెస్తామని జియో ప్రతినిధులు తెలిపారు. అయితే ఈ సర్వీస్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై స్పష్టత లేదు. ఇండియాలో టెక్నాలజీపరంగా జరిగే మార్పులన్నింటిలో తన పాత్ర కీలకంగా ఉండాలని జియో భావిస్తోంది.

No comments:

Post a Comment